BREAKING : బీజేపీ లో చేరిన టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్

-

ఢిల్లీ : బీజేపీ పార్టీ లో చేరారు టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు, తెలంగాణ ఉద్య‌మ కారుడు విఠల్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్ చార్జ్‌ తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు తెలంగాణ ఉద్య‌మ కారుడు విఠల్. పార్టీ కండువా క‌ప్పి… విఠ‌ల్ ను ఈ సంద‌ర్భంగా ఆహ్వనించారు. బీజేపీ పార్టీ సిద్దాంతాలు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ని తీరు న‌చ్చే… ఆ పార్టీ లో చేరుతున్న‌ట్లు ఇప్ప‌టికే విఠ‌ల్ చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే… ఇవాళ ఢిల్లీ కి వెళ్లి.. బీజేపీ పార్టీ లో చేరారు విఠ‌ల్‌.

కాగా… రేపు తీన్మార్ మల్లన్న కాషాయ కండువా కప్పుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంతా సిద్ధం అయింది. జాతీయ, రాష్ట్ర బీజేపీ నాయకుల సమక్షంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం కేసులు పెట్టిన సందర్భంలో అతనికి బీజేపీ పార్టీ అండగా నిలిచింది. ఈ త‌రుణంలోనే మ‌ల్ల‌న్న కూడా బీజేపీలో చేర‌నున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version