ప్రస్తుతం తెలంగాణలో పాలిటిక్స్ మొత్తం హుజూరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. అందరూ ఎదురు చూస్తున్నట్టు నిన్న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి.. సమరానికి సై అన్నారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజీకీయాలు హీటెక్కాయి. అటు ప్రత్యక్ష రాజకీయాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలూ సన్నద్ధమవతున్నాయి. ఇక ఈటల కూడా బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే ఈటలను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆయనన్ను బీజేపీవైపు నడిపించడంలో ఇద్దరు నాయకులు కీలకంగా వ్యవహరించారు. అందులో మరీ ముఖ్యంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఆయనే తన ఫామ్‌హౌజ్‌లో ఈటలతో చర్చించేందుకు బీజేపీ పెద్దలను ఆహ్వానించారు. ఆ తర్వాత కూడా ఆయన ఈటల వెంటే ఉన్నారు.
ఈటలను ఢిల్లీకి తీసుకెళ్లింది కూడా వివేక్ వెంకటస్వామినే. అలాగే మొన్న తరుణ్ చుగ్ ఈటల ఇంటికి వచ్చినప్పుడు కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఇక నిన్న ఈటల రాజీనామా చేస్తున్నప్పుడు కూడా బీజేపీ తరఫున ఆయన ఒక్కరే ఉన్నారు. దీనికి కారణం ఆయన కరీంనగర్లో పట్టుకోసమే ప్రయత్నిస్తున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. కరీంనగర్లో బండి సంజయ్ తర్వాత ఆయనే కీలకంగా ఉన్నారు. కాబట్టి రేపు భవిష్యత్ లో ఈటల లాంటి నాయకుడి అండ ఉండాలని వివేక్ చూసుకుంటున్నారు.