సింగరేణి కార్మికులకు కరోనా వ్యాకినేషన్ నేటినుంచే.

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే మెగా వ్యాక్సినేషన్లు వేగంగా ప్రారంభమయ్యాయి. సూపర్ స్ప్రెడర్లుగా భావించే వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్ మొదలు కానుంది. ఈ రోజు నుండి పది రోజుల పాటు పెద్దపల్లి సింగరేణిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. 11ఏరియాల్లోని 29వేల మందికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కోసం 30వేల వ్యాక్సిన్లు కేటాయించింది.

కార్మికులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనా జరుగుతున్నే పోరాటంలో సురక్షితంగా ఉండేందుకు వ్యాక్సిన్ ఒక్కటే సరైన మందు అని, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా నియమాలు పాటించాలని, మాస్క్, చేతుల శుభ్రత, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. కరోనా మూడవ వేవ్ ని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని సూచించింది.