గుడ్ న్యూస్: పడిపోయిన పసిడి..!

-

పసిడి ప్రియులకి గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. దీనితో పసిడి ప్రియులకి కాస్త రిలీఫ్ కలుగుతుంది అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ ధరలు తగ్గడం జరిగింది.

gold/ పసిడి

ఇక ధరలు ఎలా వున్నాయ్ అనేది చూస్తే.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX మార్కెట్‌లో బంగారం ధర శుక్రవారం పడిపోయింది. దీనితో రూ.318 దిగొచ్చింది. ఇక పది గ్రాముల బంగారం ధర రూ.48,880కు తగ్గింది. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయడమే మంచిది. లేదు అంటే మళ్ళీ ఎంత పెరిగిపోతుందో చెప్పలేము.

ఇది ఇలా ఉంటే బంగారం ధర 2021 చివరి కల్లా 10 గ్రాములకు రూ.53,500కు చేరే అవకాశం ఉందట. మరో నెల రోజుల వరకు రూ.48,300 నుంచి రూ.49,500 మధ్య లో బంగారం ధరలు వుంటాయని.. ఆ తర్వాత పసిడి రేటు పైకి చేరొచ్చని రూ.51 వేలకు పరుగులు పెట్టొచ్చని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా దీపావళి నాటికి బంగారం ధర రూ.53,500కు చేరొచ్చని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌కు చెందిన అనుజ గుప్తా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news