తెలంగాణలో ఈటల రాజేందర్ (Etela Rajender) మార్కు రాజకీయం ఇప్పుడు ఎంతపెద్ద సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన టీఆర్ ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సమరానికి సిద్ధమయ్యారు. ఎలాగైనా హుజూరాబాద్‌లో గెలిచిన తన బలమేంటో నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గేర్ మార్చిరాజకీయాలు మొదలు పెట్టారు.
ఇక టీఆర్ఎస్ కూడా ఎలాగైనా ఈటలను ఒంటరి చేసేందుకు విశ్వ శక్తులు ఒడ్డుతోంది. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు నాయకత్వంలో హుజూరాబాద్ రాజకీయాలను నడిపిస్తోంది. ఈటలకు వ్యతిరేకంగా కార్యకర్తల వర్గాన్ని తయారు చేస్తోంది. దీంతో ఈటల అలర్ట్ అయ్యారు. ఇక నుంచి ఫుల్‌టైమ్ నియోజకవర్గంలోనే పర్యటించాలని డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలో రేపు కమలాపూర్, శంభుని పల్లి, కానిపర్తి గ్రామాల్లో ఈటల రాజేందర్ పర్యటించి, వారితో మాట్లాడనున్నారు. ఈ గ్రామాల్లో ఈటలకు వ్యతిరేకంగా కార్యకర్తలు టీఆర్ఎస్‌కు వెళ్లడంతో వారిఇన మళ్లీ కలుపుకునేందుకు ప్లాన్ వేశారు. ఇదే విధంగా నియోజకవర్గమంతా పర్యటించి వ్యతిరేకంగా మారుతున్న వారిని కలుపుకుని పోవడానికి సన్నద్ధమయ్యారు. కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఆయన ఈ పర్యటన చేస్తున్నట్టు తెలుస్తోంది.