తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11:30 లకు అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ కి టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. అటు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాజరయ్యారు. సీఎం కేసీఆర్ అఖిల పక్షానికి మోత్కుపల్లి కూడా హాజరు అయ్యారు. బీజేపీ బహిష్కరించినప్పటికీ మోత్కుపల్లి హాజరు కావడంతో బీజేపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అఖిలపక్షానికి మోత్కుపల్లి వెళ్లడంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మండిపడ్డారు.
పార్టీ నిర్ణయం పై మోత్కుపల్లి నర్సింహులుకు సమాచారం ఉందని… కమ్యూనికేషన్ గ్యాప్ ఏమి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సమావేశంకు ఆయన పోకుండా ఉండాల్సిందని… అక్కడికి వెళ్ళిన ఆయన కేసీఆర్ దళితులకు చేసిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే బాగుంటుందని చురకలు అంటించారు. దళితుడీని సీఎం చేస్తా అని చెప్పి ఎందుకు చేయలేదు అని అడగాలని.. దళితులకు మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించాలని మోత్కుపల్లిని డిమాండ్ చేశారు.