కూపీ లాగుతున్న సీబీఐ.. వివేక హత్య కేసులో తెరపైకి మరో ఇద్దరు వ్యక్తులు

కడప: వివేక హత్య కేసు విచా రణను సీబీఐ బృందం వేగవంతం చేసింది. తాజాగా 6 రోజు విచారణను ప్రారంభించింది. కడప, పులివెందు‌లలో రెండు బృందాలుగా విడిపోయి అధికారులు విచారణ చేపడుతున్నారు. పులివెందుల్లోని విచారణలో ఓ పార్టీకి చెందిన ఇద్దరులు కొత్తగా తెరపైకి వచ్చారు. శుక్రవారం కిరణ్ కుమార్ యాదవ్, సునీల్ అన్నదమ్ముల నివాసానికి వెళ్ళి కుటుంబసభ్యులందరినీ విచారించారు. సునీల్, కిరణ్ అన్నదమ్ములు అప్పట్లో వివేకా దగ్గర సన్నిహితంగా ఉండువారని తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన ముందు రోజు ఆ ప్రాంతంలో ఎక్కువ సా ర్లు తిరిగిన కార్లు వివరాలపై రవాణశాఖ అధికారులతో ఆరా తీశారు. ఓ కారుకు సంబంధించి రవి, అతని డ్రైవర్ గోవర్దన్‌లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

కాగా వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద హత్య కేసు మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. 2019 సాధారణ ఎన్నికలకు ముందు కడప జిల్లా పులివెందులలో వివేక హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి కేసు పలు మలుపులు తిరిగింది. అప్పట్లో ఈ కేసును చంద్రబాబు నాయుడు సిట్‌కు అప్పగించారు. ఈ తర్వాత వివేక కూతురు సునీత అభ్యర్థన మేరకు కేసును సీబీఐకు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగూతనే ఉంది.