వివో నుంచి వి20 స్మార్ట్ ఫోన్‌.. అద్భుత‌మైన ఫీచ‌ర్లు… ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు వివో భార‌త్‌లో కొత్త‌గా వి20 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. వి సిరీస్‌లో వ‌చ్చిన వివో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 8జీబీ ప‌వ‌ర్ ఫుల్ ర్యామ్ ల‌భిస్తుంది.

Vivo V20 smart phone launched in india

వివో వి20 ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మోనో సెన్సార్‌, ముందు వైపు 44 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ కూడా ఉంది.

వివో వి20 స్పెసిఫికేష‌న్లు…

* 6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్
* 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
* 64, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 44 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వి20 స్మార్ట్ ఫోన్ మూన్‌లైట్ సొనాటా, మిడ్‌నైట్ జాజ్‌, స‌న్‌సెట్ మెలోడీ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.24,990 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.27,990గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను అక్టోబ‌ర్ 20 నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news