విశాఖ భూకుంభకోణం పై పని మొదలెట్టిన సిట్

-

గత ప్రభుత్వ హయాంలో విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభ కోణాల మీద వైసీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణ మళ్లీ మొదలైంది. కరోనా వల్ల ఈ ఏడాది మార్చి నెల నుంచి ఈ విచారణ నిలిచి పోయింది. అయతే వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సిట్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ కుమార్‌ మొన్ననే విశాఖ చేరుకుని కమిటీతో భేటీ అయ్యారు.

కోవిడ్ కారణంగా ‍ ఇన్నాళ్ళు నిలిచిపోయిన , విచారణ ఇప్పుడు ప్రారంభించామని, జిల్లా అధికారులు సిబ్బందితో మళ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించామని ఆయన అన్నారు. నవంబర్ చివరి నాటికి నివేదిక అందిస్తామని అయన పేర్కొన్నారు. గతంలో సిట్‌ వద్ద పనిచేసిన ఉప కలెక్టర్‌ శేష శైలజ, తహసీల్దార్‌ తిరుమలరావుకు ఇటీవల బదిలీ అయ్యింది. వారి స్థానంలో సిట్‌కు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news