పాక్ సరిహద్దుల్లో అలజడి…

-

ఒక పక్క కరోనా వైరస్ తో దేశం ఇబ్బంది పడుతున్న సమయంలో పాకిస్తాన్ ఇప్పుడు భారత్ పై కక్ష సాధింపు చర్యలకు దిగాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి ఉగ్రవాదులను భారీగా పంపే ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాదాపు 400 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ సిద్దంగా ఉంచి వాళ్ళను ఇక్కడికి పంపడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు.

పాక్ భారత్ సరిహద్దుల్లో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కంచెను కూడా కట్ చేసే అవకాశాలు ఉన్నాయని, తుపాకులు, బాంబుల కంటే కరోనా వైరస్ తో ఎక్కువ మందిని చంపే అవకాశం ఉంటుందని పాకిస్తాన్ భావిస్తుంది. అందుకే ఇప్పుడు మన సైనికులకు కూడా కరోనా వైరస్ ని అంటించే ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులు దేశంలోకి వచ్చేశారు.

దీనితో మన నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. బీహార్ సరిహద్దుల్లో ఇప్పటికే నేపాల్ నుంచి వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనితో బీహార్ పోలీసులు, సైన్యం అప్రమత్తమైంది. ఏదైనా చిన్న తేడా వచ్చినా సరే భారీ మూల్య౦ చెల్లించాలి. అటు సైనికులు కూడా సామాజిక దూరం పాటిస్తూనే చెకింగ్ లు చేస్తున్నారు. ప్రత్యేక బలగాలను సరిహద్దుల్లో చెకింగ్ ల కోసం నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news