తెలంగాణాలో సరిహద్దుల్లో కరోనా భయం…!

-

తెలంగాణాలో సరిహద్దు గ్రామాల ముందు ఇప్పుడు పెద్ద సవాల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీ కర్ణాటక ఏమో గాని… మహారాష్ట్రలో ఏకంగా 3 వేల కరోనా కేసులు ఉన్నాయి. అక్కడ ప్రతీ రోజు వందల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రతీ రోజు అక్కడ వందల కేసులు నమోదు కావడం మరణాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరగడం ఇప్పుడు భయపెడుతుంది. ఏ విధంగా అక్కడ కట్టడి చేస్తున్నా సరే కట్టడి కావడం లేదు.

తెలంగాణా తో మహారాష్ట్ర తో దాదాపుగా 500 కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంది. ఇక్కడ ఎన్నో గ్రామాలు కూడా ఉన్నాయి. కొండ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలో ఉన్న గిరిజనులు తెలంగాణ వస్తూ ఉంటారు. ఇందులో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. అవి పచ్చగా ఉండటంతో ఇప్పుడు అక్కడి గిరిజనులు అటవీ సంపద కోసం తెలంగాణాలో అడుగు పెట్టే సూచనలు ఉంటాయి. వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా సరే నరకం చూడాలి.

సరిహద్దుల్లో ఉన్న రోడ్డు మార్గాలను తెలంగాణా సర్కార్ పూర్తిగా మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినా సరే అక్కడి నుంచి కొండ అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులు వచ్చే అవకాశం ఉంది. దీనితో ఇప్పుడు తెలంగాణా సర్కార్ అప్రమత్తమవుతుంది. గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలి ని భావిస్తుంది. అక్కడి నుంచి నిత్యావసర సరుకులను కూడా దిగుమతి చేసుకోవద్దు అని కేసీఆర్ సర్కార్ భావిస్తుంది. గ్రామాల్లో కరోనా వెళ్ళింది అంటే దాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇప్పటి నుంచే పక్కా చర్యలు తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news