కోవి సెల్ఫ్ కిట్ తో కరోనా టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ గైడ్లైన్స్ పాటించండి..!

-

మన భారతదేశంలో రోజుకి 16 లక్షల నుంచి 19 లక్షల వరకు కరోనా శాంపిల్స్ ని టెస్ట్ చేస్తున్నారు. మే 19న ఏకంగా 20 లక్షల శాంపిల్స్ ని కలెక్ట్ చేసి టెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ల్యాబ్ కి వెళ్లి టెస్ట్ చేసుకోవడం సులభం అవ్వడం లేదు ఎక్కువ మంది వస్తున్నారు అని అంటున్నారు.

ముఖ్యంగా పట్టణాలలో ఈ సమస్య వస్తోంది. అయితే తాజాగా రూపొందించిన సెల్ఫ్ టెస్టింగ్ కోవి కిట్ తో ఇంట్లోనే సులభంగా కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. వాటికి ఇక్కడ పద్ధతి ఉంది చూడండి. దీని కోసం నాజిల్ శాంపిల్ కావాలి.

హోమ్ టెస్టింగ్ ఇలా చెయ్యచ్చు అని ఐసీఎంఆర్ చెప్పింది ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళు సులభంగా ఇంట్లో వుండే టెస్ట్ చేసుకోవచ్చు దీనిని టెస్ట్ చేసుకోవడానికి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు. రెండు ఏళ్ళ వయసు ఉన్న వారి నుంచి ఎవరైనా సరే టెస్ట్ చేసుకోవచ్చు.

దీని కోసం ముందుగా శ్వాబ్ తాలూకు హెడ్ ని ముట్టుకోకుండా రెండు నోస్ట్రయిల్స్ లో రెండు మూడు సెంటీ మీటర్ల వరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ రోల్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ట్యూబ్ ని తీసేసి ట్యూబ్ లో దానిని ముంచాలి. 15 నిమిషాలు వెయిట్ చేయాలి.

అప్పుడు రిజల్ట్ వస్తుంది. ఇరవై నిమిషాల తర్వాత ఏమైనా రిజల్ట్ వస్తే అది ఇన్వాలిడ్. పదిహేను నిమిషాల తర్వాత ఆప్ లో మీకు రింగ్ వచ్చి రిజల్ట్ వస్తుంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంక ఏ టెస్ట్ చేసుకోక్కర్లేదు అని కరెక్ట్ గా ఒకవేళ టెస్ట్ లో నెగిటివ్ వస్తే ఆర్తీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు. దీనికి రెండు వందల యాభై రూపాయలు అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news