బ్రేకింగ్:రఘురామ ఫ్యామిలీ ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ రియాక్షన్

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్ లో విచారణ జరుగుతుంది. రఘురామ కృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ జరిగిందని ఆయన కాలికి గాయాలు ఉన్నాయని మెడికల్ రిపోర్ట్ లో స్పష్టంగా ఉందని రఘురామ తరుపు లాయర్ ముకుల్ రోహాత్గి వాదించారు. ఇక నిన్న రఘురామ ఫ్యామిలీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది.

రఘురామ కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై స్పందించిన లోక్ సభ స్పీకర్… రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపించారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను స్పీకర్ కోరారు. రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు స్పీకర్ కార్యాలయం పంపించింది.

Read more RELATED
Recommended to you

Latest news