రఘురామ కేసులో సుప్రీం కోర్ట్ లో ఏం జరుగుతుంది…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో కాసేపటి క్రితం తిరిగి వాదనలు ప్రారంభం అయ్యాయి. రఘురామకృష్ణరాజు ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అని ప్రభుత్వానికి, సీఎంకు అనేక విషయాల్లో సూచనలు చేశారు అని రఘురామ తరుపు లాయర్ ముకుల్ రోహాత్గి వాదించారు. కానీ సీఎం వాటిని పట్టించుకోలేదు. ఒక రెడ్డి కులానికే ప్రాధాన్యత కల్పిస్తూ వెళ్లారు అని ఆయన వాదించారు.

ఈ అంశాలపై విమర్శలు చేస్తూ వచ్చారు అని అన్నారు. అలాగే సీఎం బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు అని తెలిపారు. ఇందులో సీఎం ప్రతివాది కాదు – ఆయనను ఇందులోకి లాగవద్దు అని ప్రభుత్వ న్యాయవాది దవే కోరారు. సీఎంపై ఆరోపణలు చేయాలంటే ఆయన్ను ప్రతివాదిగా చేర్చండి అని దవే సూచించారు. 14న గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు అని ముకుల్ వాదించారు. సీఐడీ ఏడీజీ స్వయంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు ఆని సీఐడీ ఏడీజీ ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి, ఆ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశానని చెబుతున్నారు అని పేర్కొన్నారు. చాలా సెక్షన్లు పెట్టారు. బెయిల్ రాకుండా చేయడం కోసం ఐపీసీ 124(ఏ) కూడా పెట్టారు అని వాదించారు.

Read more RELATED
Recommended to you

Latest news