తెలుగు హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మాస్ ఫైట్స్, ఊర మాస్ డైలాగులతో బాలయ్య సినిమాలు రావడంతో జనాలకు పూనకాలే..ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత బాలయ్య ఒక్కరికే దక్కుతుంది..మాస్,యాక్షన్, లవ్, ఎమోషన్స్ కలిపిన సినిమా అంటే అందరికి సింహా సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా వచ్చి 12 ఏళ్లు అయిన కూడా ఆ సినిమాకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు..
బోయపాటి శ్రీను శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాలయ్య కెరీర్ కి బూస్ట్ ని ఇచ్చింది. ఈ సినిమాను అందరికి నచ్చే విధంగా రూపొందించారు.. ప్రేక్షకుడు ఈ సినిమాను చూస్తున్నసేపు ఎంజాయ్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రజల మంచి కోసం పాటు పడే వ్యక్తి పాత్రలో బాలయ్య కనిపించారు. నలుగురికి మంచి చేసేందుకు ఆయుధం పట్టిన వైద్యుని పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించాడు. ఈ నటన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ నటుడు ప్రదర్శించని రౌద్ర రసం వెండి తెర పై తెలుగు వారు చూడగలిగారు. డాక్టర్ నరసింహగా చూపిన భావోద్వేగాలు నభూతో.!
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే అత్యంత భారీ హిట్ ను అందుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి..ఈ సినిమా కలెక్షన్స్ విషయాన్నికొస్తే..రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.31.64 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంటే బయ్యర్స్ కు 12.94 కోట్ల లాభాలను అందించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో బాలయ్య రేంజ్ పూర్తిగా మారిపోయింది.
ఆ తరువాత సినిమాలు కూడా ఇదే స్థాయిలో థియేట్రికల్ హిట్స్ కొట్టాయి. లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ నమోదు చేశారు బాలయ్య – బోయపాటి ద్వయం.