విజయమ్మ పెంపకం వల్లే జగన్‌ 16 నెలలు జైలుకెళ్లారా ? : టీడీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

-

సీఎం జగన్‌ పై టీడీపీ నేత వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన అత్యాచార ఘటనలపై కూడా స్పందించరా..? విజయమ్మ గారి తప్పుడు పెంపకం వల్లే జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై వరుసగా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా జగన్ మూగ సీఎంలా మారారని.. ఇష్టానుసారంగా తల్లుల పెంపకం మీద తల్లులమీద మాట్లాడితే తాటతీస్తామని హెచ్చరించారు.

ఒక ఆడది అయ్యుండి మరో తల్లి గురించి నీచంగా మాట్లాడటం బాధాకరమని… ఈ హోం మంత్రి కన్నా గతంలో పనిచేసిన హోంమంత్రి బెటర్ అనిపిస్తుంది. కనీసం రాసిచ్చిన స్క్రిప్ట్ అయినా చదివేదని ఎద్దేవా చేశారు. తల్లుల పెంపకం మీద మాట్లాడితే తాటతీస్తామని.. హోంమంత్రికి అనిత వార్నింగ్‌ ఇచ్చారు. జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని.. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా తానేటి వనిత రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తూ ఉన్నారని… రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచారం ఘటన ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలని డిమాండ్‌చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news