గోల్డ్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా ? బ‌్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ఇస్తున్న వ‌డ్డీ రేట్లు ఇవే..!

-

ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది గోల్డ్ లోన్‌. ఎందుకంటే మ‌న వ‌ద్ద ఉండే బంగారు ఆభ‌ర‌ణాల‌ను తీసుకెళ్తే ఆర్థిక సంస్థ‌లు త్వ‌ర‌గా.. నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఇస్తాయి. అందువ‌ల్ల ఎమ‌ర్జెన్సీలో చాలా మంది గోల్డ్ లోన్ల‌ను తీసుకుంటుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయా బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు గోల్డ్ రుణాల‌కు గాను అందిస్తున్న వ‌డ్డీ రేట్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

want to take gold loan here are the interest rates offered by banks and nbfcs

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 7 నుంచి 7.50 శాతం వ‌డ్డీతో గోల్డ్ లోన్ ఇస్తోంది. 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. దీనికి జీఎస్టీని అద‌నంగా చెల్లించాలి.

* పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో 8.60 శాతం నుంచి 9.15 శాతంతో గోల్డ్ లోన్ పొంద‌వ‌చ్చు. వీరు లోన్ మొత్తంలో 0.75 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకుంటారు.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వారు 9.90 శాతం నుంచి 17.90 శాతం మ‌ధ్య వ‌డ్డీ రేటుతో బంగారు ఆభ‌ర‌ణాల‌పై రుణం ఇస్తున్నారు. 1.50 శాతం ప్రాసెసింగ్ ఫీజును జీఎస్టీతో క‌లిపి చెల్లించాలి.

* ఐసీఐసీఐ బ్యాంకులో 10 నుంచి 19.76 శాతం వ‌డ్డీ రేటుతో గోల్డ్ లోన్ పొంద‌వ‌చ్చు. లోన్ మొత్తంలో 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు.

* యాక్సిస్ బ్యాంకులో 9.75 నుంచి 17.50 శాతం వ‌డ్డీ రేటు ఉంటుంది. 1 శాతం ప్రాసెసింగ్ ఫీజును జీఎస్‌టీతో క‌లిపి తీసుకుంటారు.

* బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో బీఆర్ఎల్ఎల్ఆర్ + ఎస్‌పీ + 1.75 శాతం వ‌డ్డీ రేటు ఉంటుంది. 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజును జీఎస్టీతో క‌లిపి చెల్లించాలి.

* కెనరా బ్యాంక్ 7.65 శాతం వ‌డ్డీ రేటుతో 1 ఏడాది కాల‌వ్య‌వ‌ధితో గోల్డ్ లోన్ ఇస్తోంది.

* ముత్తూట్ ఫైనాన్స్‌లో 12 నుంచి 27 శాతం వ‌డ్డీ రేటుతో లోన్ ఇస్తారు.

* మ‌ణ‌ప్పురంలో 29 శాతం వ‌ర‌కు గ‌రిష్టంగా వ‌డ్డీ రేటు ఉంటుంది.

బంగారు ఆభ‌ర‌ణాల‌పై రుణం పొందేవారు పాన్‌, ఆధార్ కార్డుల‌ను తీసుకెళ్లాలి. ఐడీ, అడ్ర‌స్ ప్రూఫ్‌ల‌ను స‌మ‌ర్పించాలి. అవ‌స‌రం అయితే ఇత‌ర డాక్యుమెంట్ల‌ను కూడా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news