గత ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియాలో తమ్ముళ్లు ఒక ట్రోల్ చేస్తున్నారు! ఏపీలో అమరావతి ఆగిపోవడానికి.. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు వెలుగులోకి రావడానికీ వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెగ కథనాలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. అసలు కేసీఆర్ కి – ఏపీలో రాజధానులకీ ఏమి సంబంధంరా బాబు అని అంటే… దానికి తమ్ముళ్లు చెప్పే సమాధానం వింటే దిమ్మతిరిగి బొమ్మ కనిపించడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు!
అవును… గత రెండు రోజులుగా… ఏపీలో మూడు రాజధానుల టాపిక్ రావడానికి, జగన్ ఆదిశగా చర్యలు తీసుకోవడానికీ తెలంగాణ ముఖ్యమంత్రి కారణం అని తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. ఎందుకయ్యా అంటే… ఏపీలో అమరావతి ఆ రేంజ్ లో డెవలప్ అయిపోతే… హైదరాబాద్ పెట్టుబడులన్నీ అమరావతికి వెళ్లిపోతాయని.. హైదరాబాద్ కు రావాల్సిన విశ్వనగరం పేరు అమరావతి పట్టుకుపోతుందని.. హైదరాబాద్ కు వచ్చే టూరిజం డబ్బులు, ఐటీ ఆదాయం మొత్తం అమరావతే తన ఖాతాలో వేసుకుంటుందని అంట!
ప్రస్తుతం కేసీఆర్ కి ఈ భయం పట్టుకుందని.. అందుకే అమరావతి డెవలప్ అవ్వకుండా విశాఖకు పరిపాలనా రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని.. కేసీఅర్ చెప్పినట్లు జగన్ నడుచుకున్నారని చెబుతున్నారు! సరిగ్గా గమనిస్తే… ఈ వాదనలో ఏదో రాజకీయంగా బురదజల్లేసి ఆనందపడే ఆలోచనలు తప్ప… అంతకు మించి ఏమైనా అర్థం ఉందా అనేది విశ్లేషకుల ప్రశ్న!
అమరావతిలో ఇప్పటివరకూ సరైన రోడ్డు లేదు.. శాస్వత భవనాలకు దిక్కులేదు.. గ్రాఫిక్స్ కి అమరావతిలో ప్రస్తుతం కనిపిస్తున్నదానికీ పొంతనే లేదు.. అసలు రాజధానిని గ్రాఫిక్స్ రూపంలో చూపించడానికే సంవత్సరాల కాలం తీసుకున్న బాబు… అది వాస్తవంలో చూపించడానికి కనీసంలో కనీసం 30 – 50ఏళ్లు పట్టొచ్చనేది టీడీపీ నేతలు చెప్పే మాట. ఈ క్రమంలో… ఆలూ లేదు సూలూ లేదు అన్నట్లుగా… అమరావతి వస్తే హైదరాబాద్ దెబ్బతింటుందని.. ఆ విషయం గురించి ఇప్పుడే కేసీఆర్ ఆలోచిస్తున్నారని అనడానికి మించిన అజ్ఞానం మరొకటి ఉండదనేది విశ్లేషకుల మాటగా ఉంది!