పంజ్ షీర్ పంజాకు మరో 700మంది తాలిబన్లు ఖతం..!

-

ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్యుద్ధం జరుగుతోంది. తాలిబన్లు ఆఫ్గన్ మొత్తాన్ని ఆక్రమించుకుని పంజ్ షిర్ కోసం యుద్దానికి వెళ్ళారు. అయితే అదే క్రమంలో పంజ్ షీర్ ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్ల చేతిలో నుండి విడిపించేందుకు పోరాడుతుంది. ఇక పంజ్ షీర్ లో మొత్తం ఎనిమిది జిల్లాలు ఉండగా వాటిలో నాలుగు జిల్లాలను ఆక్రమించామని తాలిబన్లు చెబుతున్నారు. కానీ పంజ్ షీర్ మాత్రం తాలిబన్లు జిల్లాలను అక్రమించలేదని…వారితో జరిగిన వార్ లో 700 మంది తాలిబన్లను హత మార్చామని చెబుతున్నారు.ఇక ఇప్పటికే 300 మంది తాలిబన్లకు

Taliban
Taliban

హతమార్చామని పంజ్ షీర్ ఓ సారి ప్రకటన చేసింది. మరోవైపు తమ వద్ద 1000 మంది తాలిబన్లు బంధీలుగా ఉన్నారని కూడా పంజ్ షీర్ తెలిపింది. కాగా ఆఫ్గన్ ప్రజలంతా పంజ్ షీర్ వైపే ఉన్నారు. తాలిబన్ల నుండి విముక్తి కోరుతున్నారు. అప్పటికే దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు దారుణాలు కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్గన్ ప్రజలు పంజ్ షీర్ వైపు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news