సెప్టెంబర్ 10న విడుదల కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలివే..!

టాలీవుడ్ లో సినిమాల సందడి మళ్ళీ మొదలవుతోంది. ఇప్పుడిప్పుడే ప్రజలు మళ్ళీ థియేటర్ లకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే థర్డ్ వేవ్ తరవాత ఇప్పటి వరకు కొన్ని సినిమాలు విడుదలైనా కూడా పెద్దగా క్రేజ్ రాలేదు కానీ..సెప్టెంబర్ 10న విడుదల కాబోయే సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం …

నాని హీరోగా నటించిన టక్ జగదీశ్ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ముందు నుండి ఎన్నో అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాను నిర్మాతలు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఇక గోపీచంద్ హీరోగా నటించిన సీటిమార్ సినిమా కూడా సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

మరోవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా కూడా సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా జయలలిత పాత్రలో నటించింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.