ఏపీ మంత్రి అనిల్, మాజీ మంత్రి నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరిలో ఎవ్వరూ ఒక మెట్టు దిగలేదు. ఒకరికంటే మరొకరు రెచ్చిపోయారు.
ఇది అసలైన వార్ అంటే. వార్ అంటే కొట్టుకోవడం అనుకునేరు. అది కేవలం మాటల యుద్ధమే. మీకు తెలుసో తెలియదో. కొట్టుకోవడం కంటే కూడా మాటలు యుద్ధం చాలా పవర్ ఫుల్. అది ఇవాళ ఏపీ శాసన మండలిలో చోటు చేసుకున్నది.
ఏపీ మంత్రి అనిల్, మాజీ మంత్రి నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరిలో ఎవ్వరూ ఒక మెట్టు దిగలేదు. ఒకరికంటే మరొకరు రెచ్చిపోయారు. మంత్రి అనిల్.. నారా లోకేశ్ భాషపై, చంద్రబాబు వెన్నుపోటుపై డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తే… నారా లోకేశ్.. జగన్ అక్రమాస్తులు, జైలుకు వెళ్లడం, చార్జీషీట్లపై డైరెక్ట్ గా విమర్శించారు. దీంతో ఇద్దరి మధ్యా కాసేపు మాటల యుద్ధం జరిగింది.
అసలు.. వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం ఎలా మొదలైందంటే… విద్యా మండలి నిధుల మళ్లింపుపై మొదలైన చర్చ.. ఎక్కడికో వెళ్లింది. దారి తప్పిపోయింది. గత ప్రభుత్వ హయాంలో నారా లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు మళ్లించారని… ఏపీ మంత్రి అనిల్ ఆరోపించగా… వెంటనే అందుకున్న లోకేశ్.. ఊరికే ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే సాక్ష్యాదారాలతో సహా నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఇలా.. మాటా మాటా పెరిగి.. చివరకు చంద్రబాబు, జగన్ దగ్గరికి పోయాయి మాటలు. మీకు వాళ్లిద్దరి మధ్య జరిగిన మాటలు యుద్ధం చూడాలని ఉంటే ఈ వీడియో చూడండి.