కులం పై ఏ విచారణకైనా సిద్దమే.. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య

-

తమ కులం పై జరుగుతున్న చర్చ పై కడియం శ్రీహరి కూతురు, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గరం అయ్యారు. తమ కులం విషయంలో ఎలాంటి విచారణకు అయినా సిద్ధంగా ఉన్నామని.. జాతీయ స్థాయి కమిషన్ మాత్రమే కాదు.. ఏ కమిటీతో అయినా విచారణకు రెడీ అని ఛాలెంజ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడారు. కడియం శ్రీహరి కులం పై ఎన్నడూ లేనంతగా ఈసారి చర్చ కొనసాగుతుంది. వాస్తవానికి ఆయన గడిచిన 40 ఏళ్లుగా ఇప్పుడు ఉన్న కులం సర్టిఫికేట్ తో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేశారన్నారు.

అప్పుడు లేని వివాదం ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. తాను దళిత మహిళగా, వైద్యురాలిగా సమాజ సేవకురాలిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నికల బరిలో నిలిచానన్నారు. కడియం శ్రీహరి దళితుడో కాదో.. నిరూపించుకోవాలని వరంగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కావ్య ఈ వ్యాఖ్యలు చేసారు. ఆరూరి కులం ప్రస్తావన తెచ్చి రాజకీయ లబ్దిపొందుతున్నారని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news