తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ లో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ ఛైతన్యపు రాజధాని, కాళోజీ నుండి పీవీ నరసింహారావు వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు జన్మనిచ్చిన గడ్డ. హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క – సారలమ్మలు నడయాడిన ప్రాంతం.
దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం. వరంగల్… వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ-దిశ మార్చేందుకు నేడు వస్తున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసి వరంగల్ కి బయలు దేరాడు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ను అందరూ ఆసక్తికరంగా చూడటం విశేషం.