జూన్ 1న ఇండియా,బంగ్లా మధ్య వార్మప్ మ్యాచ్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే T20 ప్రపంచకప్‌ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇదిలా ఉంటే… టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు బంగ్లాదేశ్తో జూన్ 1న భారత జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. వార్మప్ మ్యాచుల షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. మే 27 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ అమెరికాలో జరగనున్నప్పటికీ వేదికను ఇంకా ఖరారు చేయలేదు. కాగా.. పాకిస్థాన్ వార్మప్ మ్యాచులు ఆడకుండా నేరుగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.కాగా, ఈ t 20 ప్రపంచ కప్ లో పాల్గొనే 20 జట్లను ఐసీసీ 4 గ్రూపులుగా విభజించింది.గ్రూప్-ఎలో భారత్, ఐర్లాండ్,పాకిస్థాన్, అమెరికా, కెనడా ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్,వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, పపువా న్యూగినియా,ఉగాండ ఉన్నాయి. గ్రూప్-డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ,బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news