క్వాలిటీలో రాజీ పడకుండా సినిమాలను రూపొందిస్తున్నాము : కమల్ హాసన్

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..క్వాలిటీలో రాజీ పడకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు. ‘ఇండియన్-2, 3 చిత్రాల షూటింగ్ పూర్తయ్యింది అని అన్నారు. ప్రస్తుతం ఇండియన్-2 పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆ తర్వాత మూడో భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాం అని తెలిపారు. కల్కి 2898ADలో నా భాగం షూటింగ్ పూర్తి చేశాం అని వెల్లడించారు.

ఎన్నికలు ముగిశాక మణిరత్నంతో థగ్ లైఫ్ మూవీ చిత్రీకరణ మొదలు పెడతాం’ అని అన్నారు.ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు . థగ్‌ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్‌-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, మద్రాస్ టాకీస్‌,రెడ్ జియాంట్ మూవీస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news