ప్రధాని నరేంద్ర మోడీని పొగిడే యువత చెంప పగలగొట్టాలి: కర్ణాటక మంత్రి

-

ప్రధాని నరేంద్ర మోడీపై కర్ణాటక రాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు . కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు .ప్రధానిని పొగిడే యువత చెంప పగలగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి అన్నారు.కారటగిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శివరాజ్ మాట్లాడుతూ ….ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి ప్రజలను మోసం చేయవచ్చని బీజేపీ భావిస్తోందని విమర్శించారు.

‘2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. ఇచ్చారా? అని ప్రశ్నించారు.మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలి అని ,వాళ్ల చెంప పగలగొట్టాలి అని అన్నారు. పదేళ్లుగా అబద్ధాలతోనే నడిపించారు’ అని ఘాటు విమర్శలు చేశారు.దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఇస్తామని వాగ్దానం చేశారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఒక్కటైనా చెప్పండి’ అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు.ప్రధాని మోదీ తెలివైనవాడు. బాగా దుస్తులు ధరిస్తాడు. స్మార్ట్ ప్రసంగాలు చేస్తాడు అని అన్నారు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి పూజలు చేస్తూ స్టంటులు చేస్తాడు. ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని ఇదేనా?’ అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news