కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడటం లేదు అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి విషయం గురించి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. దాడికి ప్రతి దాడి చేయడం మంచిది కాదని మేము భావించాం. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసు విత్ డ్రా చేసుకోవడం కోర్టులో ఆశ్చర్యపోయానని తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడిని అంతా చూశారని తెలిపారు.
పార్టీ కార్యాలయంలో వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఇలా జరుగుతుందా..? అని ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పై మరో రాజకీయ పార్టీకి సంబంధించిన వారు దాడి చేయలేదని తెలిపారు. ఆరోజు కంప్యూటర్ ఆపరేటర్ తో ఫిర్యాదు చేయించినట్టు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. కేసు విచారణ జరుగుతోంది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మూడు రోజుల ముందు తానే ఆశ్చర్యపోయానని తెలిపారు. దాడికి ప్రతిదాడి చేయాలంటే 8 నెలల సమయం కావాలా..? అని ప్రశ్నించారు.