వృద్ధిరేటు 7% ఉంటుందని అంచనా వేస్తున్నాం – నిర్మల సీతారామన్

-

2023 – 24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టారు. కోవిడ్ సమయంలో పీఎం గరీబ్ కళ్యాణి అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది కూడా ఇది కొనసాగుతుందని తెలిపారు. భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అన్నారు నిర్మల సీతారామన్. వృద్ధిరేటు సెవెన్ పర్సెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.

దేశంలో గత తొమ్మిది ఏళ్లలో తలచారి ఆదాయం రెట్టింపు అయిందన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. దేశంలోని అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి చేయూతనిస్తామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్, లడక్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పంటల దిగుబడి, భీమాకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అగ్రి స్టార్ట్ అప్ లకు చేయూతనిస్తూ.. ఫండింగ్ చేస్తున్నామన్నారు. ఆత్మనిర్బార్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు నిర్మల సీతారామన్.

Read more RELATED
Recommended to you

Latest news