టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుండి రాష్ట్రవ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టిడిపి ముఖ్య నేతలతో నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. అనుబంధ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు యువగళం యాత్ర చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా పోరాడుతానన్నారు నారా లోకేష్. పార్టీ యంత్రాంగం మొత్తం యువగళం యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో మూడున్నర ఏళ్లుగా సైకో పాలను చూస్తున్నామని.. సమస్యలపై పోరాడుతున్న టిడిపి శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.