తుఫాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్నాం – మంత్రి కాకాని

-

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి కాకాని గోవర్ధన్ తెలిపారు. ఏపీలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు మంత్రి.

అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఇక తిరుపతి జిల్లాలో నేటి మధ్యాహ్నం నుండే పాఠశాల, కాలేజీలకు సెలవులు ప్రకటించామని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. సంబంధిత పాఠశాలలు, కళాశాలలు, వాటి యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని.. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన మండుస్ తుఫాన్ నేడు తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా రూపుమార్చుకొని తీరం వైపు దూసుకు వస్తుంది. దీంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news