జనసేన పార్టీ నడపడానికి వకీల్ సాబ్ ఇంధనంగా పని చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. తొలి ప్రేమ సినిమా చేసిన సమయంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా పని చేశారు. ఆ తరువాత గొప్ప నిర్మాతగా ఎదిగారు. దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా నాకు చాలా ఉపయోగపడిందని తెలిపారు. కీలక సమయంలో వకీల్ సాబ్ విజయం సాధించి నా పార్టీని నడిపించిందని తెలిపారు.
రంగ స్థలం సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారని తెలిపారు. రామ్ చరణ్ కి నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో పుట్టినప్పుడు మా నాన్న రామ్ చరణ్ అని నామకరణం చేశారని తెలిపారు. చిరంజీవి ఎంతో కష్టపడేవారు. చిరంజీవి గారు అన్న కాదు.. పితృ సమానులు. మా వదిన మాతృ సమానులు. రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటి వాడు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.