చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చేలా మార్పులు తీసుకొస్తాం : సీఎం జగన్

-

చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చేలా మార్పులు తీసుకొస్తామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖలో భవిత పేరుతో కొత్త ప్రోగ్రామ్ ని  ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఉపాధి పొందిన యువతతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. క్వాలిటీ ఎడ్యూకేషన్ తో మన పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. క్వాలిటీ చదువుల కోసం కరిక్యులమ్ లో మార్పులు తీసుకొస్తున్నాం.

158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయని తెలిపారు. వీరికి ట్రైనింగ్ ఇచ్చిన తరువాత ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కిల్  హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒకేచోటనే ఐటీఐ, పాలిటెక్నిక్ అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం జగన్. బెస్ట్ ఐటీఐ, బెస్ట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చేందుకు.. ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో స్కిల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.రాష్ట్రంలో యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని.. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చేలా మార్పులు తీసుకురాబోతున్నామని తెలిపారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news