రేషన్‌ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరతాము :మంత్రి నాదెండ్ల మనోహర్‌

-

రేషన్‌ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పౌరసరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ..కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్‌ సరకులు వెళ్తున్నాయని మండిపడ్డారు. రేషన్‌ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరతామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వార్నింగ్ ఇచ్చారు .

”టోల్‌గేట్‌ల వద్ద సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతాం అని అన్నారు. తొలిరోజు తనిఖీల్లో కాకినాడలోని 6 గోదాముల్లో లోపాలు గుర్తించాం. రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు గుర్తించాం. 7615 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నము. కాకినాడలో ఒక వ్యవస్థీకృత మాఫియా ఏర్పడింది. ఇక్కడి రేషన్‌ మాఫియా సొంత నౌకనే ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఉంది అని అన్నారు. కాకినాడ పోర్టు అంటేనే అందరూ భయపడుతున్నారు అని అన్నారు. నిన్నటి తనిఖీల్లో 6 సంస్థల పాత్రను గుర్తించాం. వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news