కూకట్‌పల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది.అమ్మాయి కోసం ఇంటర్ విద్యార్థులు ఏకంగా వారి స్నేహితుడిని చంపారు.అల్లాపూర్ ప్రాంతంలో తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించొద్దని దానిష్ అనే బాలుడిని 10 మంది స్నేహితులతో కలిసి ఇంటర్ బాలుడు చంపాడు.
బీరు సీసాలతో తలపై కొట్టి, గొంతు నులిమి హత్య చేసారు. మృతదేహాన్ని రైల్వే ట్రాక్ మీద పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మైనర్లు ప్లాన్ వేసారు.హత్య చేసినపుడు అందరూ గంజాయి మత్తులో ఉన్నట్టు సమాచారం.