కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, హెచ్ డి కుమారస్వామి లకు బెదిరింపు లేఖలు రావడం కలకలం సృష్టించింది. వీరితో పాటు61 మంది రచయితలకుు ఈ లేఖలు వచ్చాయి. చంపేస్తామంటూ వచ్చిన ఈ లేఖలు ఎవరు పంపించారు అనేది తెలియడం లేదు. ఈ లేఖలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులు ముస్లింల పక్షాన ఉంటూ, హిందూ సమాజం పై విమర్శలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. సిద్ధరామయ్య, కుమారస్వామి లతోపాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ లేఖలు రాశారు.వీరందరూ హిందూమత ద్రోహులు. ఏ క్షణంలోనైనా మీకు మృత్యువు లభించవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. అని లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖ చివర్లో” ఓ సహనం కలిగిన హిందువు” అని రాసి ఉంది. ఈ లేఖపై స్పందించిన మాజీ సీఎం హెచ్ డి కుమారస్వామి దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి మరింత సమాచారం అందిస్తానని తెలిపారు.బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు తక్షణమే పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. తాను దేవుడిని నమ్ముతానుతాను దేవుడిని నమ్ముతాను అని ఈ విషయంలో తనకు ఎలాంటి భయాలు లేవని కుమారస్వామి చెప్పుకొచ్చారు..