లాక్ డౌన్ ఎత్తివేయకపోతే చంపేస్తాం…!

-

అమెరికాలో లాక్ డౌన్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దాన్ని అమలు చేయవద్దు అని చాలా మంది ప్రజలు అక్కడి డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో గురువారం ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. బులెట్ ప్రూఫ్ దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు తుపాకులతో మిచిగాన్ లోని కాపిటల్ భవనంలోకి ప్రవేశించి, కఠినమైన కరోనావైరస్ లాక్డౌన్ ఉత్తర్వులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

లాబీలో డజన్ల కొద్దీ ప్రదర్శనకారులు అక్కడ నిరసన వ్యక్తం చేసారు. హౌస్ ఛాంబర్ లోపల అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే అక్కడే ఉన్న పోలీసు బలగాలు వారిని లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. నలుగురు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వచ్చినట్టు గుర్తించారు. తుపాకులతో వచ్చి లాక్ డౌన్ ని ఎత్తివేయాలి అని వారు డిమాండ్ చేయడం విశేషం. గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌ను అడాల్ఫ్ హిట్లర్‌గా చిత్రీకరిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

కరోనా మహమ్మారి సహా ఏ కారణం అయినా సరే పౌరుల జీవించే హక్కులను రద్దు చేయడం అనేది తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు వాళ్ళు. మార్చి 24 న విట్మెర్ జారీ చేసిన స్టే-ఎట్-హోమ్ ఆదేశాలు పౌరుల హక్కులకు భంగం కలిగించే అవకాశం లేదని మిచిగాన్ కోర్ట్ రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. కాగా కరోనా వైరస్ కారణంగా ఆ రాష్ట్రంలో 3,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news