ఎన్నికల తరువాత గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

-

సెప్టెంబర్ లోపు గల్ఫర్ కార్మికుల కోసం ప్రణాళిక రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  గల్ఫ్ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల తరువాత గల్ఫ్ పాలసీ తీసుకొస్తామన్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధి పై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఆ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ గల్ఫ్, ఓవర్సిస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించామన్నారు. కార్మికుల సహాయార్థం ప్రజా భవన్ లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news