అలర్ట్ : రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

-

గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో చలి బీభత్సంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోవడం కారణంగా… ఈ చలి తీవ్రత ఎక్కువగా నమోదు అవుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం లేవగానే రోడ్లన్నీ మంచుతో కూరుకుపోతున్నాయి. ఇలాంటి తరుణంలో… 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడన ద్రోణి ఏర్పడటం కారణంగా వచ్చే 24 గంటల్లో ఏపీ లోని పలు చోట్ల భారీ నుంచి అతి వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమ, కోస్తాంధ్ర లో భారీ వర్షాలు, తెలంగాణలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు అలర్ట్ అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news