భవానీపూర్ నుంచి మమతా పోటీ.. నేడే నామినేషన్

వెస్ట్ బెంగాల్ లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. పశ్చిమ బెంగాల్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీ నామినేషన్ వేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్… నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేయనున్నారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు మమతా బెనర్జీ.

అయితే మమతా బెనర్జీ పోటీ చేసే… భవానీపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇక ప్రధాన ప్రతిపక్షం అయినా బిజెపి తన అభ్యర్థిని బరిలో నిలబడి ఉంది. ఇందులో భాగంగానే మమతా బెనర్జీ పై పోటీకి బీజేపీ తమ అభ్యర్థిని కూడా ఫైనల్ చేసింది.

అడ్వకేట్ ప్రియాంక… భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ పై పోటీ చేస్తారని ప్రకటించింది బిజెపి. దీంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. కాగా ఈ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిస్తేనే… పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న సంగతి తెలిసిందే.