చాయ్‌వాలీగా మారిన దీదీ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చాయ్ వీడియో..!

-

దీదీ తాను చాయ్ చేసి ఇచ్చిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. మోదీ ఒకప్పుడు చాయ్‌వాలా కాగా.. ఇప్పుడు దీదీ చాయ్ అని.. చాయ్‌వాలీ దీదీ.. అని రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సాధారణంగా మన దేశంలో ఎక్కడైనా సరే.. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు.. నేతలు ప్రజల వద్దకు క్యూ కడుతుంటారు. ఆపసోపాలు పడుతూ.. ఏదో ఒక విధంగా ప్రజలను ఆకర్షించి ఓట్లను సంపాదించే పనిలో పడుతుంటారు. అందులో భాగంగానే త్వరలో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరనున్న నేపథ్యంలో అక్కడి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కూడా రాష్ట్రమంతటా పర్యటించడం ప్రారంభించారు.

west bengal cm mamatha benerjee makes chai in tea stall

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం దిఘా అనే ప్రాంతంలో పర్యటించారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్ దుకాణం వద్ద ఆగిన దీదీ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం అక్కడి చాయ్ వాలాను అడిగి చాయ్ ఎలా చేస్తారో తెలుసుకుని మరీ ఆ స్టాల్‌లో చాయ్ పెట్టారు. అనంతరం ఆ చాయ్‌ను గ్లాసుల్లో పోసి పక్కనే ఉన్న వారికి ఆమె ఇచ్చారు. చాయ్ ఎలా ఉందని కూడా ఆమె వారిని అడగడం విశేషం.

కాగా దీదీ తాను చాయ్ చేసి ఇచ్చిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. మోదీ ఒకప్పుడు చాయ్‌వాలా కాగా.. ఇప్పుడు దీదీ చాయ్ అని.. చాయ్‌వాలీ దీదీ.. అని రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా దీదీ తన పోస్టులో తనకు ఇలా చాయ్ చేసివ్వడం అంటే ఇష్టమని, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే ఎంతో సంతోషం లభిస్తుందని అన్నారు. ఇక ఈ వీడియోపై మోదీ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news