ఈ వాస్తు దోషాలు ఉంటే.. అనారోగ్య సమస్యలే..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన అంతా మంచే జరుగుతుంది. శుభం కలుగుతుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. వాస్తు దోషాలు ఉంటే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాస్తు దోషం వలన కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. ఎప్పుడూ కూడా ఇంటి దక్షిణ దిశని తెలిసి ఉంచకూడదు. ఎందుకంటే ఇది యమ ధర్మరాజు దిశ. ప్రతికూల శక్తి కలుగుతుంది.

ఇంట్లో వృద్ధుల మీద ఇది ప్రభావం చూపుతుంది కాబట్టి అసలు ఈ పొరపాటు చేయకండి. దక్షిణ వైపు ఓపెన్ చేసి ఉండడం వలన అకాల మరణం కూడా సంభవిస్తుందని అంటుంటారు కాబట్టి తెరిచి ఉండడం కంటే మూసేసి ఉంచడం మంచిది. మంచం కింద పొరపాటున కూడా చెప్పులు వంటివి పెట్టకండి. మంచం కింద ఇలాంటివి పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

పనికిరాని వస్తువుల్ని కూడా చాలామంది ఎక్కడ పెట్టాలో తెలియక మంచం కింద పెడతారు అది కూడా తప్పు. ఆ అలవాటుని కూడా మానుకోవడం మంచిది. ఈ పొరపాటు చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఇంటి మధ్య భాగం బ్రహ్మస్థానం. పాత రోజుల్లో ఇల్లు బహిరంగ ప్రాంగణం తో ఉండేది ఉత్తరం లేదా తూర్పు వైపున బహిరంగ ప్రాంగణాన్ని నిర్మించుకోండి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపున ఈ బహిరంగ ప్రాంగణాన్ని నిర్మించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news