కేరళలో మరో కలవరం.. వెలుగులోకి ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’

-

కేరళను మరో వైరల్‌ ఫీవర్‌ పట్టి పీడిస్తోంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ వ్యాపిస్తోంది. త్రిశూర్‌, మళప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర  ఆరోగ్యశాఖ ఆదేశించింది. వెస్ట్‌ నైల్‌ అనేది వైరల్‌ జ్వరం అని.. ఇన్‌ఫెక్షన్‌ సోకిన క్యూలెక్స్‌ దోమ ద్వారా మానవులకు సంక్రమిస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీనికి ఎటువంటి ఔషధాలు, వ్యాక్సిన్‌ లేదని.. లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం, వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వెస్ట్‌నైల్‌ ఫీవర్‌ లక్షణాలు ఇవే

 

ఈ ఫీవర్ బాధితుల్లో తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. కొందరిలో మాత్రం జ్వరం, తలనొప్పి, వాంతులు, దురద వంటి లక్షణాలుంటాయని చెప్పారు. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రం మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు. ఫలితంగా అపస్మారక స్థితిలోకి జారిపోయే ప్రమాదం ఉందని.. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చని పేర్కొన్నారు. ఈ ఫీవర్‌ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news