శెనగలు ఒక మంచి పౌష్టికహారం. శెనగలలో మన శరీరానికి మేలు చేసే అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్స్ తో పాటు ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్,ఫైబర్ వంటి ఖనిజాలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ప్రతిరోజు మొలకెత్తిన శెనగలు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం ఉన్నవారికి శెనగలు ఎంతో మేలును చేస్తాయి. ఇవి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇందులో ఉండే పొటాషియం,ఐరన్, జింక్ వంటి పోషకాలు అధిక రక్తపోటు సమస్యలను నియంత్రిస్తాయి. పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు, అజీర్తి ఆహారం సరిగ్గా జరగకపోవడం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది.సాధారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్య రక్తహీనత ఒకటి. వీటిలో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. గనుక రోజు క్రమం తప్పకుండా మొలకెత్తిన శెనగలను తీసుకోవడం వలన శరీరానికి తగినంత ఇనుము అందుతుంది. రక్తహీనత సమస్య దూరం అవుతుంది. ఎర్ర రక్త కణాలు కూడా అభివృద్ధి చెందుతాయి.
మొలకెత్తిన శెనగలను ప్రతిరోజు తీసుకుంటే గుండెకు రక్త సరఫరా సక్రమంగా అవుతుంది. వీటిలోని పోషకాలు గుండెకు బలాన్ని చేకూరుస్తాయి.సెనగలలో ఉండే పోషకాలు అమినో ఆసిడ్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దానివల్ల గుండెలోని రక్త కణాలు ముసుకు పోయే ప్రమాదం తగ్గుతుంది. ఫోలేట్ వలన కొత్త కణాలు ఉత్పత్తి జరుగుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు మొలకెత్తిన సెనగలను తమ డైట్ లో చేర్చుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. ఎందుకంటే వీటిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ. ఎందుకంటే సెనగలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తిని కలిగి ఉన్నాయి. సెనగలలో ఉండే ఫోలైట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తాయి.