ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదలకు ఇల్లను నిర్మించి ఇచ్చేందుకు ఓ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారికి సీఎం మరో శుభవార్త చెప్పారు. జగనన్నకాలనీలలో ఇళ్లను నిర్మించుకునే లబ్దిదారులకు పావలా వడ్డీపై రుణాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసకున్నారు. ఈమేరకు అన్ని బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అత్యవసరమైన సమయంలో ఆ పట్టాలపై రుణాలు తీసుకునెలా వెసులుబాటు కల్పించామని సీఎం అన్నారు. ఈ రుణాలపై లబ్దిదారుడికి కేవలం రూ.25పైసల వడ్డి పడుతుందని ముఖ్యమత్రి అన్నారు. మిగతా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం తీసకున్న ఈ నిర్ణయంతో జగనన్న కాలనీలలో ఇళ్లు నిర్మించుకునేవారికి ఎంతో మేలు జరగనుంది.