దేశభద్రతపై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటో చెప్పాలి : ధర్మపురి అరవింద్

-

దేశభద్రతపై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటో చెప్పాలి అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ప్రశ్నించారు.ఇవాళ నిజామాబాద్ లో నిర్వ హించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రద్దయిన ఉగ్రవాద సంస్థలు, ఆర్గనైజేషన్లు బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.

 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని వార్నింగ్ ఇచ్చారు.ఫ్రీ హామీలిచ్చి ప్రజలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వారి ఉసురు తగిలి త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతదని అన్నారు. కానీ ఈ సారి జరిగే ఎన్నికలు నరేంద్ర మోదీ ఎన్నికలని అన్నారు. రాముడి పేరు చెబితే కడుపు నిండుతదా అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఖచ్చితంగా తమకు కడుపు నిండుతదన్నారు ధర్మపురి అర్వింద్.మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. రాజ్యాంగంలో అమెండ్‌మెంట్స్ కొత్తేమీ కాదని, కాంగ్రెస్ పార్టీ అమెండ్‌మెంట్స్ ఎక్కువ సార్లు చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ సెక్యులర్ పదం ఎట్లా చేరుస్తదన్నారు. రేవంత్ హిందువులకు సూక్తులు చెప్పడం బంద్ చేయాలని ,మహిళలు ఎన్నికల్లో ముఖం కనిపించకుండా ఓటు వేయడాన్ని అనుమతించవద్దనే విషయమై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news