పక్షాలలో ఏ తిథి ఏం ఫలితం వస్తుంది !

-

భాద్రపదమాసంలో కృష్ణపక్షంలో తిథులను మహాలయ పక్షాలు అంటారు. అయితే ఈ పదిహేను తిథులలో శ్రాద్దం పెడితే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం…


తిథి ఉపయోగాలు
పాడ్యమి ధన సంపద
విదియ రాజయోగం, సంపద
తదియ శతృవినాశనం
చతుర్థి ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి
పంచమి ఉత్తమ లక్ష్మీప్రాప్తి
షష్టి శ్రేష్ఠ గౌరవం
సప్తమి యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తి
నవమి అంతులేని సంపద
దశమి ధాన్య , పశుసంపద వృద్ధి
ఏకాదశి సర్వశ్రేష్ఠదాన ఫలం
ద్వాదశి సమాజ అభివృద్ధి, ఆహార భద్రత
త్రయోదశి ఐశ్వర్యం, దీర్ఘాయువు, సంపూర్ణ ఆరోగ్యం
చతుర్థశి శతృభయం నుండి విముక్తి
అమావాస్య అన్ని కోరికలు నెరవేరుతాయి
మహాలయ రోజు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాకుండా వారి సంరక్షకుడైన శ్రీమహావిష్ణువుకి కూడా చేరతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశిష్టత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాలు, పిండప్రదానం సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతాపితరుల కోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విధి కర్మలను ఆచరించాలి. ప్రతి ఏటా చేసే శ్రాద్ధకర్మల కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేష్ఠం, శుభకరం.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news