ఆ తప్పు చేశా.. భవిష్యత్తులో జరగబోదని హామీ ఇస్తున్నా : బాబు

-

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో వర్చువల్ సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎన్నో పోరాటాల తర్వాత మీటర్లు లేకుండా రైతులు ఉచిత విద్యుత్ సాధించారని అన్నారు. కానీ అప్పు కోసం రైతు బతుకుల్ని తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇది అత్యంత దుర్మార్గపూరితమైన చర్యన్న అయన ప్రజావ్యతిరేక విధానాలతో వైసీపీ ప్రభుత్వం అప్రతిష్ట పాలైందని, వైసీపీకి ఓట్లు ఎందుకు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.

ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభ్యున్నతికి ముఖ్య ప్రాధాన్యతనిచ్చానన్న ఆయన ఆ క్రమంలో పార్టీని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. కానీ భవిష్యత్తులో అలాంటి తప్పు జరగబోదని హామీ ఇస్తున్నానని, కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని అభయం ఇచ్చారు. ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా ఉండాలన్న అయన ఏ ప్రాంతంలో ఎవరి నాయకత్వం ఎప్పుడు అవసరమో గుర్తించి.. వారికి బాద్యతలు అప్పగిస్తానని అన్నారు. అందరం కలిసి మళ్లీ మనం అధికారంలోకి వచ్చేలా శ్రమిద్దామని
తద్వారా రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించుకుందామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news