ఇటీవలే హస్తిన పర్యటనకు వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం జగన్ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి సిద్ధమై రేపు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్న విషయం తెలిసిందే. జగన్ ఢిల్లీ పర్యటన ఎంతో ఆసక్తిని సంతరించుకుంది. అయితే మొదటి నుంచి తమ కూటమి లో వైసీపీ చేరాలని బీజేపీ కోరినట్లు వార్తలు వచ్చాయి. వైసిపి ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. కానీ ఇటీవలే ఏకంగా మిత్ర రాష్ట్రమైన తెలంగాణను కాదని సీఎం జగన్ వ్యవసాయ బిల్లుకు మద్దతు తెలిపారు. అంతలోనే ఢిల్లీ పయనమయ్యారు.
దీంతో మోదీ కోరినట్లుగానే కూటమిలో కలిసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా అనే చర్చ కూడా ప్రస్తుతం మొదలయింది. అదే సమయంలో ప్రస్తుతం వైసీపీకి కొరకరాని కొయ్యగా మరిన వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశంపై కూడా మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక పోలవరానికి రావాల్సిన నిధులు… సహా మరికొన్ని అంశాలను కూడా ప్రధాని మోదీ భేటీతో సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ప్రస్తుతం జగన్ పర్యటన మాత్రం ఆంధ్ర రాజకీయాల్లో ఎంతో ఆసక్తిని సంతరించుకుంది అని చెప్పాలి.