మొత్తానికి మునుగోడులో కాంగ్రెస్ కాస్త ముందుగానే మెల్కొంది..ఎట్టకేలకు అభ్యర్ధిని ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలు స్రవంతికి సీటు ఫిక్స్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచి..మునుగోడు కాంగ్రెస్ లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు అనే విషయం తేల్చకుండా ఉండటం వల్ల…మునుగోడులో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు చేజారుతూ వస్తున్నారు. ఇప్పటికే కొందరు బీజేపీ వైపు, మరికొందరు టీఆర్ఎస్ వైపు వెళ్లారు.
దీంతో దాదాపు 40 శాతం క్యాడర్…కాంగ్రెస్‌ని వీడారని వ్యూహకర్త సునీలే రిపోర్ట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మేల్కొని…వెంటనే పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యత వచ్చి…మునుగోడులో స్రవంతిని గెలిపించడం. మరి నేతలంతా ఒకేతాటిపై ఉండి స్రవంతికి సహకరిస్తారో లేదో చూడాలి. ఆమె గెలుపు కోసం ఎంతమంది నేతలు కష్టపడతారో చూడాలి.
ఇక మునుగోడులో స్రవంతికి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి..ఆమె బలం ఎంత ఉందనే విషయాలని చూసుకోవాలి. మామూలుగా పాల్వాయి వారసురాలు కాబట్టే సహజంగానే ఆమెకు ఫాలోయింగ్ ఉంది. 2014 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 27 వేలు పైనే ఓట్లు తెచ్చుకుంది. అంటే పాల్వాయి కుటుంబంపై మునుగోడు ప్రజలకు అభిమానం ఉంది.
అదే సమయంలో కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి స్రవంతికి మునుగోడులో గెలుపు దిశగా వెళ్లొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది…ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు చాలా వరకు…టీఆర్ఎస్, బీజేపీ వైపు వెళ్లారు. కాబట్టి స్రవంతి గెలుపు కష్టమవుతుంది. కాంగ్రెస్‌కు దూరమైన వారిని మళ్ళీ దగ్గర చేసుకోవాలి…అలాగే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లని బీజేపీకి పడకుండా చూసుకోవాలి…అదే సమయంలో కాస్త కమ్యూనిస్టు ఓటర్లని తమవైపుకు తిప్పుకుంటే స్రవంతికి గెలుపు అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న ఫైట్‌లో గెలుపు కోసం స్రవంతి చాలా కష్టపడాలి. మరి చూడాలి మునుగోడులో స్రవంతి ఎంతవరకు పోరాడగలరో.