ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన పానీయాలు..

-

ఉదయం లేవగానే టీ, కాఫీల కోసం పరుగులు తీస్తారు. వేడి వేడి కాఫీ కడుపులో పడితే గానీ ఏ పని ముట్టుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్ళ నుండి కాఫీ, టీలు తాగడం అలవాటైపోయింది. అందుకే పొద్దున్న పూట టీ, కాఫీ కాకుండా ఇంకా తాగడానికి ఏమైనా పానీయాలున్నాయా అన్న విషయం కూడా గుర్తుకు రాదు. ఉదయం పూట టీ, కాఫీ కాకుండా తాగడానికి పనికొచ్చే ఆరోగ్యకరమైన పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి పడుకుని పొద్దున్న లేచేసరికి కడుపు ఖాళీగా ఉంటుంది. సుమారు 12గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోరు కాబట్టి, ఉదయం లేచి ఏది తాగినా శరీరం దాన్ని తొందరగా జీర్ణం చేసుకుంటుంది. పానీయాల వంటివి తాగితే శరీరానికి బాగా వంటబడుతుంది. ఐతే ఎలాంటి పానీయాలు ఆరోగ్యకరమైనవి, వేటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలి.

కిచెన్ లో ఉన్న వస్తువుల్లో చాలామటుకు ఉదయం పూట లేవగానే తాగడానికి పనికొచ్చేవే ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల ఆకలి బాగా వేయడంతో పాటు ఆరోగ్యం బాగుంటుంది.

మొదటగా,

గోరువెచ్చని నీటిలో తులసి ఆకులను వేసుకుని తాగడం.
నిమ్మరసం, తులసి ఆకులు, తేనె, అల్లం తీసుకుని నీటిలో ఉడికించి తాగాలి.
గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని వేసుకుని తాగాలి.
అల్లం, మిరియాలు, పసుపు తీసుకుని నీటిలో ఉడకించి తాగాలి.
ఇవన్నీ కాకుండా కేవలం గోరువెచ్చని నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నిమ్మ, అల్లం, దాల్చిన చెక్క, పసుపు, నల్ల మిరియాలు, నీళ్ళూ, తేనె కలిపి తీసుకోవచ్చు.

వీటన్నింటిలో దాదాపుగా నిమ్మ కామన్ గా ఉంది. అంటే ఉదయం పూట నిమ్మరసం తాగడం ఎంత మంచిదో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. దానిలో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news